ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్-19కి టీకాను అభివృద్ధి చేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. 'కరోఫ్లూ' అనే పేరుతో వ్యాక్సిన్‌ను ఆవిష్కరించే ప్రక్రియలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థలతో భారత్ బయోటెక్ ఒప్పందం కూడా చేసుకుంది.
కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కోవిడ్-19 నియంత్రణకు కరోఫ్లూ పేరుతో కరోనా వ్యాక్సిన్ తయారీ దిశగా అడుగులు వేస్తున్నందుకు కేటీఆర్ అభినందించారు. సంస్థ సీఎండీ డా.కృష్ణ ఎల్లా, బృందం విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు.