ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ హాస్పటిల్‌లో పనిచేసే 108 మంది వైద్య సిబ్బంది ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్నారు. ఇటీవల ఆ హాస్పటల్‌కు వచ్చిన ఇద్దరు పేషెంట్లు కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. దీంతో వారికి సేవలు చేసిన 108 వైద్య సిబ్బందిని క్వారెంటైన్‌కు పరిమితం చేసినట్లు అధికారులు చెప్పారు. 85 మంది ఇంట్లో క్వారెంటైన్ కాగా, మరో 23 మందిని హాస్పటల్‌లో క్వారెంటైన్ చేశారు. ఇక కరోనా ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు ఢిల్లీకి చెందిన సఫ్‌దార్‌జంగ్ హాస్పటల్ తమ వైద్య సిబ్బందికి చెందిన పేర్లు, మొబైల్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలను పోలీసులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. ప్రధాని కేర్స్ ఫండ్‌కు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.
కరోనా అనుమానాలు.. క్వారెంటైన్‌లో 108 మంది హాస్పిటల్ సిబ్బంది