రూపాయి కోసం చిందిన రక్తం

రూపాయి కోసం చిందిన రక్తం


కర్ణాటక ,తుమకూరు: ఒక్క రూపాయి కోసం రక్తం చిందింది. ఎవరో ఒకరు సర్దుకునిపోయి ఉంటే సరిపోయేదానికి బాహాబాహీ తలపడడంతో అందరూ విస్తుపోయారు. రూపాయి చిల్లర విషయమై కండక్టర్‌–ప్రయాణికుని మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన మధుగిరి తాలూకా చిక్కపాలనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం మధుగిరి నుంచి బెంగళూరుకు బయలుదేరిన కేఎస్‌ఆర్టీసీ బస్సులో నాగేనహళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాదనాయకనహళ్లికి వెళ్లడానికి టికెట్‌ తీసుకున్నాడు. తన స్టాప్‌ సమీపిస్తుండడంతో తనకు ఇవ్వాల్సిన ఒక్క రూపాయి చిల్లర ఇవ్వాలంటూ ప్రయాణికుడు కంబయ్య కండక్టర్‌ అజ్జప్పను అడిగాడు. అయితే తన వద్ద చిల్లర లేదని కండక్టర్‌ బదులివ్వడంతో ఇదే విషయమై ప్రయానికుడు, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు.